దశాబ్దాల తరబడి రసాయన ఎరువులతో వ్యవసాయం చేయడం వల్ల నేలలో జీవపదార్థం నశించి పోయింది. ఈ తరం అయినా సేంద్రియ సాగు చేయక పోతే మన భూమిని ఆరోగ్యాన్ని కాపాడుకోలేం. అందుకే బీఎస్సీ చదువు పూర్తికాగానే ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ పై శిక్షణ పొంది ఇక్కడ పాఠాలు నేర్పుతున్నాను.సేంద్రియ సాగు పై విద్యార్ధులను తీర్చి దిద్దే కళాశాల దేశంలో ఇదొక్కటే. యువకులను వ్యవసాయ శాస్త్రంతో పాటు వ్యహారంలో కూడా నిష్ణాతులను చేయడానికి ఏకలవ్య అకాడమీ ఆఫ్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ పని చేస్తుంది.

గ్రామీణ నిరుద్యోగులను కర్షకులుగా తీర్చిదిద్ది ప్రకృతి సాగు పై శిక్షణ ఇస్తున్నాం.పంటలకు అవసరమైన కాషాయాలు,ఎరువులు తయారుచేసుకోవడం నేర్పుతున్నాం. ఉదయం పొలంలో, మధ్యాహ్నం క్లాసుల్లో పాఠాలు నేర్పుతున్నాం. రెండేళ్లలో జీరోబడ్జెట్‌తో సేంద్రియ సాగు చేసే నిష్ణాతులుగా తయారై తాము సొంతంగా వ్యవసాయం చేసుకోవడం, వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేయడం ద్వారా ఆదాయం పొందవచ్చు..

– గీత. ఆర్గానిక్‌ ట్రైనర్‌, ఏకలవ్య అకాడమీ ఆఫ్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌