organic-revolutionSuccess stories for Ekalavya foundation
By Ruralmedia
………………………………………………………..
1, organic revolution
In that village, everything deeper than 6 inches is stone. These farmers have domesticated 75 acres of such land for organic farming without no investment, and are cultivating ten varieties of vegetables. Thisnatural cultivation method without routine procedures and use of pesticides is a new lesson to farming.
In the current scenario, where the farmers are reciting to the use of higher amounts of pesticides and chemical fertilisers in the quest for high yields, an attempt was made by Ekalavya foundation to gain awareness in the farmers about organic farming in Jingurthi, Vikarabad district.
300 farmers were trained in vermin-compost preparation along with zero budget cultivation procedures. One among those were Yadamma who implemented organic farming in one acre land for bitter gourd cultivation and is gaining aboutRs.50,000 annually.

1, బ్యాక్‌ టు నేచర్‌
…………………….
అరడుగు తవ్వితే అంతా రాతి నేల. అలాంటి మట్టిని మచ్చిక చేసుకొని 75 ఎకరాల్లో పైసా పెట్టుబడి లేని సేంద్రియ సాగులో పది రకాల కూరగాయలు పండిస్తున్నారీ రైతులు. పొలం దున్న కుండా, పురుగు మందు చల్లకుండా ఈ వీరు చేస్తున్న ప్రకృతి సాగు రొటీన్‌ వ్యవసాయానికి కొత్త పాఠం.
అధిక దిగుబడులు సాధించాలనే తపనతో రైతులు విచ్చలవిడిగా పురుగుమందులు,రసాయన ఎరువులు వాడుతూ విషతుల్యమైన పంటలు పండిస్తున్న నేపథ్యంలో రైతులకు సేంద్రియ సాగు పట్ల అవగాహన కల్గించే ప్రయత్నం వికారాబాద్‌జిల్లా , జిన్‌గుర్తిలో ఏకలవ్య ఫౌండేషన్‌ మొదలు పెట్టింది. 300 మంది రైతులకు జీరోబడ్జెట్‌ సాగుతో పాటు వర్మీకంపోస్టుతయారీలో శిక్షణ ఇస్తున్నారు. ఇలా సేంద్రియ సాగు పాఠాలు నేర్చుకున్న యాదమ్మ ఎకరం పొలంలో కాకర కాయలు పండిస్తూ ఏడాదికి రూ.50వేల ఆదాయం పొందుతున్నారు.

wedding-by-goats2, Wedding by goats
This is the story of a magician who made 60 goats of two.This is not any black-magic or a miracle. This is the story of a hard-worker, KomaramMutha, who obtained financial help from Ekalavya Foundation to buy two goats and gradually raised them to sixty goats.
JaalamThanda and KolamGuda are twin villages in Indravellimandal, Adilabad district. Ekalavya Foundation with the help of NABARD took the initiative for Watershed Scheme because of which the dry lands of these two villages transformed into agricultural fields.
Ekalavya Foundation helped those landless farmers by granting them,loans from NABARD. This way, KomaramMutha bought two goats. With his regular and appropriate care, they gradually developed into 60. He achieved self-sufficiency by selling away the fully grown goats from time-to-time. Now, the poor tribal does not have financial difficulties or pending loans. Besides giving him the goats, the Ekalavya Foundation took over the responsibility for their health.
Each week a veterinarian examines the health of the goats and suggests the necessary precautions. KomaramMutha sought good alliance for his daughter and got her married with the returns by selling the goats.

2, మేకలు చేసిన పెళ్ళి
……………………………..
ఇది రెండు మేకల్ని 60 మేకలు చేసిన మాంత్రికుడి కథ. ఇదేదో మాయలు మంత్రాలతో మేకల సంఖ్యని పెంచిన మాంత్రికుడి కథకాదు. ఏకలవ్య ఫౌండేషన్‌ ఆర్ధిక సాయంతో రెండు మేకలను పొంది, వాటిని క్రమంగా అరవై మేకలకు పెంచిన శ్రామికుడు కొమర ముత్తా కథ. ఆదిలాబాద్‌ జిల్లా, ఇంద్రవెల్లి మండలంలో జాలం తాండా, కొలాం గూడా జంట పల్లెలు. ఏకలవ్య ఫౌండేషన్‌ నాబార్డు సాయంతో అమలు చేసిన వాటర్‌షెడ్‌ పథకం ద్వారా ఈ రెండు గ్రామాల్లోని బీడు భూములు సాగులోకి వచ్చాయి. అక్కడ భూమిలేని రైతులకు వారి జీవనోపాధుల కోసం నాబార్డు ద్వారా రుణాలు ఇచ్చారు. అలా రుణం పొందిన
కొమర ముత్తా రెండు మేకలను కొన్నాడు. వాటిని అడవుల్లోకి తీసుకెళ్లి మేపుతూ, శ్రద్ధగా పోషించిడం వల్ల క్రమంగా అవి అరవై సంఖ్యను దాటాయి. చేతికి అంది వచ్చిన మేకలను అమ్ముకుంటూ అతడు స్వయం సమద్ధిని సాధించాడు. ఇప్పుడా పేద గిరిజనుడికి ఆర్థిక ఇబ్బందులు లేవు. అప్పులు లేవు. అతడికి మేకలను ఇవ్వడంతోపాటు వాటి ఆరోగ్యానికి సంబంధించిన బాధ్యతను కూడా ఏకలవ్య ఫౌండేషన్‌ తీసుకుంది. ప్రతి వారం ఒక పశువైద్యుడు మేకల ఆరోగ్యాన్ని పరిశీలించి, అవసమైన జాగ్రత్తలు సూచిస్తాడు. మేకలు అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయంతోనే కొమర ముత్తా తన కూతురికి ఈమధ్యే మంచి సంబంధం చూసి పెళ్ళి చేశాడు.

ekalavya-manatelangana